పొచ్చర జలపాతం వద్ద వరద ఉధృతి

60చూసినవారు
భారీ వర్షాలు పడుతుండడంతో ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పొచ్చర జలపాతం ఉదృతంగా ప్రవహిస్తుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్న వరద నీరుతో పొచ్చర జలపాతం ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. వరద ఉధృతికి జలపాతం కనపడకుండా పోయింది. ఉప్పొంగి ప్రవహిస్తున్న పొచ్చర జలపాతం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంది.

సంబంధిత పోస్ట్