బోథ్ మండల కేంద్రంలో గల తహశీల్దార్ కార్యాలయం శిథిలావస్థకి చేరగా, బోథ్ మండల రైతులకు ప్రజల ఇబ్బందుల దృష్ట్యా బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు కృషితో బోథ్ తహశీల్దార్ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి రూ. 48. 25 లక్షలు మంజూరు చేయించారు. రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ చేతుల మీదుగా గురువారం అధికారిక మంజూరు పత్రాన్ని బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు అందుకున్నారు.