తాంసి మాజీ జడ్పీటీసీ తాటిపెళ్లి గంగాధర్ రాజు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గా నియమితులయ్యారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో అధ్యక్షుడు పతంగె బ్రహ్మానంద్ ఆయనకు మంగళవారం నియామకపత్రాన్ని అందజేశారు. అయనకు జిల్లా, మండల నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు.