గుడిహత్నూర్ ఎళ్ల తరబడి ఎదురుచూస్తున్న లింగపూర్ గ్రామానికి రోడ్డు మంజూరు కావడంతో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కృషికి గుడిహత్నూర్ మండలంలోని లింగపూర్ గ్రామస్థులు బుధువారం ఎమ్మెల్యే చిత్రపటానికి పాలభిషేకం చేసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. గ్రామస్తులు మాట్లాడుతూ ఎన్నికల్లో భాగంగా లింగపూర్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గుడిహత్నూర్ మండల కేంద్రం నుంచి లింగపూర్ వయా మాన్కాపూర్ వరకు బీటీ రోడ్ నిర్మాణానికి రూ. 3 కోట్ల 55 లక్షలు ఎన్డిఎఫ్ (ఎస్టీ ) నిధుల మంజూరైనట్లు చేయించారన్నారు.