గుడిహత్నూర్ ఛత్రపతి శివాజీ తన ధీరత్వంతో, నియంతృత్వాన్ని ఎదిరించి, సామాజిక రాజ్య స్థాపనతో సబ్బండ వర్గాలకు పాలనలో భాగస్వామ్యం కల్పించిన మహారాజ్ అని బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగె బ్రహ్మానంద్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.