ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించబోయే దీక్షా దివాస్ కార్యక్రమానికి శుక్రవారం గుడిహత్నూర్ బిఆర్ఎస్ మండల నాయకులు, ఉద్యమకారులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆదిలాబాద్ కు బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాడు కేసీఆర్ చేపట్టిన ఉద్యమం భావితరాలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు.