గుడిహత్నూర్ మండలంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. సాయి నగర్ సమీపంలో రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. మండలంలోని మన్నూర్ గ్రామానికి చెందిన తోఫిక్, జాఫర్ బైక్‌పై రాంగ్ రూట్లో ఇచ్చోడా వైపు వెళ్తున్నారు. ఇస్లాం నగర్‌కు చెందిన షారుక్ ఖాన్ ఆదిలాబాద్ వైపు వెళ్తున్న క్రమంలో రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. కాగా తోఫిక్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.