గుడిహత్నూర్ మండలం గురుజా గ్రామానికి చెందిన కేంద్రే కృష్ణ రావ్ కు మంజూరైనా రూ. 27వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల్ గౌడ్ శుక్రవారం అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందితే ఖర్చుల వివరాలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమర్పించి సీఎంఆర్ఎఫ్ ధ్వారా లబ్ది పొందాలని సూచించారు.