గుడిహత్నూర్ మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ను మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి మాజీ చైర్మన్ దోమకొండ సుధాకర్, మాజీ ఉపసర్పంచ్ నక్క భూమన్న, మండల యువ నాయకులు ఎల్కపల్లి సదానంద్, భువనేశ్వర్, కల్లేపల్లి ప్రశాంత్ ఉన్నారు.