ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ లో గాలి వాన బీభత్సం సృష్టించాయి. మంగళవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులకు మండలంలో చాలా చోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు, ఇంటి గోడలు నేలకొరిగాయి. మండలంలోని లింగాపూర్ గ్రామంలో విద్యుత్ వైర్లపై చెట్లు పడటంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. దీంతో రాత్రంతా మండలం మొత్తం అంధకారంలో మునిగిపోయింది.