గుడిహత్నూర్: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్‌

68చూసినవారు
గుడిహత్నూర్: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్‌
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్‌ చేసినట్టు ఎస్సై మహేందర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు మేరకు గురువారం గుడిహత్నూర్ మండలం కేంద్రంలోని రైతు వేదిక వద్ద కొందరు గంజాయి సరఫరా చేస్తున్నారనే సమాచారం మేరకు ఎస్సై తన సిబ్బందితో కలిసి తనిఖీ చేపట్టారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా వారి వద్ద 400 గ్రాముల గంజాయి లభించింది. ఇద్దరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ భీమేష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్