అక్కడ నెట్వర్క్ కోసం గుట్ట ఎక్కాల్సిందే

664చూసినవారు
అక్కడ నెట్వర్క్ కోసం గుట్ట ఎక్కాల్సిందే
నేరడిగొండ మండలంలోని బొరిగాం గ్రామంలో చాలా రోజుల నుంచి నెట్వర్క్ సమస్య వెంటాడుతోంది. ఈ సమస్య ను చాలా మంది అధికారుల దగ్గర తీసుకెళ్లిన ఇప్పటివరకు ఈ సమస్య మీద ఏ అధికారి కూడా స్పందించలేదు. బొరిగాంలో ఉన్న విద్యార్థులు చదువుకు దూరమై గుట్ట గుట్ట తిరుగుతూ నెట్వర్క్ ఎక్కడ వస్తుందో అక్కడ వెళ్లి ఆన్లైన్ క్లాసులను వింటున్నారు. అలాగే డౌన్లోడ్ చేసుకుని వస్తున్నారు. ఈ ఊరిలో ఉన్న విద్యార్థులు చాలా రోజుల నుంచి ఆన్లైన్లో క్లాసులు వినలేక పోతున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న విద్యార్థులు చదువుకు దూరం అయ్యారు. ఈ ఊరిలో నెట్వర్క్ రావాలంటే వాటర్ ట్యాంకు లేదా గుట్ట ఎక్కాల్సిందే. నెట్వర్క్ కొరకు ఈ ఊరి విద్యార్థులు 2 కి.మీ దూరం నడిచి వెళ్ళితే గానీ ఈ విద్యార్థులకు నెట్వర్క్ రాదు, ఈ సమస్యను తొందరగా తీర్చాలని బొరిగాం విద్యార్థులు మరియు గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్