గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనిలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ను గుడిహత్నూర్ గ్రామస్థులు కోరగా, ఈ మేరకు స్పందించిన ఎమ్మెల్యే గ్రామంలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయించారు. అయితే మంగళవారం రాత్రి మాజీ సర్పంచ్ రవి నాయక్, బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులతో కలిసి వాటిని ప్రారంభించారు. ఎమ్మెల్యేకు వారు కృతజ్ఞతలు తెలిపారు.