ఆదివాసులు చదువుల్లో రాణించాలని జిల్లా ఎస్పీ గౌస్ ఆలం పేర్కొన్నారు. శనివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇచ్చోడ మండలం సిరిచెల్లెమ్మ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉట్నూర్ ఎఎస్పి కాజల్ తో కలిసి ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం చలి దృష్ట్యా దుప్పట్లను పంపిణీ చేశారు. సైబర్ క్రైమ్, మాదకద్రవ్యాల నిర్మూలన తదితర వాటిపై అవగాహన కల్పించారు