ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన మెడికల్ యజమాని మహేష్ తండ్రి డాక్టర్ ప్రభాకర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ శనివారం వారి కుటుంబాన్ని పరామర్శించారు. వారి వెంట మాజీ జెడ్పిటిసి తాటి పెళ్లి గంగాధర్, సీనియర్ నాయకులు కనపర్తి చంద్రకాంత్ , మండల నాయకులు సుభాష్ పాటిల్ హారన్, తదితరులు ఉన్నారు.