రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యమని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదానికి పిలుపునిచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జ్ ఆత్రం సుగుణక్క అన్నారు. ఆదివారం ఇచ్చోడ మండలంలోని కేశవపట్నం, గుండాల, నర్సాపూర్, సిరిచల్మ గ్రామాల్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రలో సుగుణక్కతో పాటు మాజీ ఎంపీ సోయాం బాపూరావు, బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆడే గజేందర్ పాల్గొన్నారు.