ఆరు గ్యారంటీ పథకాల హామీని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇచ్చోడ మండలంలోని ముఖరా(కే ) గ్రామస్థులు సోమవారం వినూత్న నిరసన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు మాకుమ్మడిగా ఉత్తరాలు రాసి పంపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల హామీని అమలు పరచాలని కోరారు. మాజీ సర్పంచ్ గాడ్గె మీనాక్షి, మాజి ఎంపీటీసీ సుభాష్, ఉన్నారు