ఇచ్చోడ లో కురిసిన వర్షం

64చూసినవారు
ఇచ్చోడ మండలంలో బుధవారం ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షం బుధవారం కురిసింది. మండల కేంద్రంతోపాటు మండలంలోని చుట్టుపక్కల గ్రామాల్లో వర్షం కురియడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వారం రోజులుగా సూర్యుడి ప్రతాపానికి ఉక్కిరిబిక్కిరి అయిన ఇచ్చోడ మండల వాసులకు ఒక్కసారిగా వర్షం కురియడంతో ఎండ వేడిమి నుంచి కాస్త ఉపశమనం కలిగినట్లు అయ్యింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్