గుడిహత్నూర్ మండలంలోని లింగపూర్ గ్రామ బీఆర్ఎస్ కమిటీని బుధవారం ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్బంగా గ్రామ కమిటీ అధ్యక్షుడిగా కంబ్లె గణేష్ ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు వారిని ఘనంగా సన్మానించారు. కష్టపడి కార్యకర్తలకు బిఆర్ఎస్ లో గుర్తింపు లభిస్తుందని గణేష్ పేర్కొన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను బూత్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానన్నారు.