తాంసి: ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే
విద్యార్థులకు విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ అన్నారు. మంగళవారం తాంసి మండల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థుల మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పాఠశాలలో గల డిజిటల్ బోర్డును పరిశీలించారు. అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలో నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లను పరిశీలించి అధికారులపై, కాంట్రాక్టర్లపై మండిపడ్డారు.