ఇచ్చోడ మండల కేంద్రంలో కొనసాగుతున్న రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ పరిశీలించారు. రోడ్డుపై గల ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తూ వాహనదారులతో మాట్లాడి రోడ్డు పనులు పూర్తయ్యేంత వరకు సహరించాలని సూచించారు. రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు ట్రాఫిక్ ఆంక్షలను పాటించాలని పోలీసులను కోరారు. త్వరలో రోడ్డు పనులు పూర్తవుతాయని, దీంతో మండల ప్రజలకు సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.