వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో భీంపూర్ మండలంలో జాతీయ ఆహార భద్రతా పథకం ద్వారా సబ్సిడీపై ఫూలే సుచిత్ర రకం జొన్న విత్తనాలను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గోడం నగేష్ ముఖ్యఅతిథిగా హాజరై భీంపూర్, రాజగడ్ రైతులకు విత్తనాల బ్యాగులను అందజేశారు. మండల వ్యసాయాధికారి వై. శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ విస్తర్ణాధికారులు కొండా వికల్, డి. శంకర్, పి. వెంకటేష్, కే. విశాల్, కే. సంగీత, కే. సాయి ప్రసాద్ తదితరులున్నారు.