బోథ్ మండలంలోని పట్నపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతుల నిర్మాణానికి రూ. 30 లక్షల నిధులతో ఎంపీ గోడం నగేష్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు ఎంపీ, ఎమ్మెల్యేను అనిల్ సన్మానించారు. విద్యార్థులు చదువుల్లో రాణించాలని సూచించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.