జలమయమైన వాంకిడి కొత్త కాలనీ

71చూసినవారు
గత రెండు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు నేరడిగొండ మండలంలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇందులో భాగంగా పలు గ్రామాలను వరద నీరు ముంచేత్తుతుంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇదేవిధంగా మండలంలోని వాంకిడి గ్రామం పక్కనున్న కొండ ప్రాంతంలో కురిసిన భారీ వర్షంతో సోమవారం స్థానిక కొత్త కాలనీ జలమయమైంది. దీంతో ఇండ్లలోకి వరద నీరు చేరడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

సంబంధిత పోస్ట్