ఆశ కార్యకర్తలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: బోథ్ ఎమ్మెల్యే

85చూసినవారు
ఆశ కార్యకర్తలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల నెరవేర్చాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఎమ్మెల్యేను గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఆశ కార్యకర్తలు కలిసి వినతి పత్రం సమర్పించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యలపై ప్రస్తావించాలని కోరారు. ఈ విషయంపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ ఆశ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, బీఆర్ఎస్ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్