తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఆర్థిక, సామాజిక, కుటుంబ సర్వే ఆన్లైన్ నమోదు కార్యక్రమం కొనసాగుతుంది. అందులో భాగంగా గురువారం తలమడుగులోని బరంపూర్ గ్రామంలోని పాఠశాల, గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న ఆన్‌లైన్ నమోదు తీరును తలమడుగు తహశీల్దార్ రాజ్ మోహన్ పరిశీలించారు. ఇప్పటి వరకు నమోదు అయిన వివరాలను ఆపరేటర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆన్‌లైన్‌లో తప్పులు జరగకుండా చూడాలని అన్నారు.