తలమడుగు: భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న మొహరం
By asmath 1చూసినవారుతలమడుగు మండల వ్యాప్తంగా మొహరం వేడుకలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. మండల కేంద్రంతో పాటు రుయ్యాడి, ఉండం, దేవాపూర్, బరంపూర్, కజ్జర్ల, సుంకిడితో పాటు పలు గ్రామాల్లోని హస్సేన్, హుస్సేన్ దేవస్థానం వద్ద సందడి నెలకొంది. పీర్లకు నూతన వస్త్రాలు చెల్లించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. రుయ్యాడి గ్రామంలోని పీర్లను రూరల్ సీఐ ఫణిధర్, ఎస్సై రాధిక దర్శించుకుని బందోబస్తు పర్యవేక్షించారు.