ముదిరాజులను బీసీ డీ నుండి బీసీ ఏలోకి మారుస్తానని ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి వెంటనే అమలు చేయాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలేంద్ర శివయ్య ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొజ్జ నారాయణ ముదిరాజులు డిమాండ్ చేశారు. ఆదివారం తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో నిర్వహించిన ముదిరాజుల జెండా పండుగ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ను అమలు చేయాలన్నారు.