గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆదిలాబాద్ ఎంపీ నగేష్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. శుక్రవారం తలమడుగు మండలం కొలం గూడా, నర్సాపూర్ గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. ముందుగా గ్రామానికి వచ్చిన వారికీ ఆదివాసులు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. వీరి వెంట మండల అధికారులు, నాయకులు ఉన్నారు.