తలమడుగు: రుణమాఫీ పూర్తి స్థాయిలో చేపట్టాలి

67చూసినవారు
అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చాలని తలమడుగు మండల రైతులు డిమాండ్ చేశారు. శుక్రవారం తలమడుగులో విలేకరుల సమావేశం నిర్వహించారు. రైతులకు రూ. 2 లక్షల వరకు పూర్తి స్థాయి రుణమాఫీ చెయ్యాలని, రైతు భరోసా రూ. 15వేలు విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి సుంకిడి అంతరాష్ట్ర రోడ్డు దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్