తలమడుగు మండలం ఝరిలో పోలీసు మీకోసం కార్యక్రమాన్ని శనివారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ ఫణిధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు సైబర్ నేరాలు, ఆన్లైన్ ఫ్రాడ్స్ పై అవగాహన కల్పించారు. గంజాయి నిర్మూలన, 100 డయల్, విలేజ్ పోలీస్ తదితర వాటి గురించి వివరించారు. గ్రామంలో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు.