తలమడుగు మండలంలోని బరంపూర్‌లో కొండపై వెలసిన శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం రథ సప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజాధి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొండ పైన స్వామివారి పల్లకీని భక్తులు బాజా భజంత్రీలతో భజన సంకీర్తనలతో ఊరేగించారు. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.