ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవం భీమన్న దేవుని పండగను ఆ సంఘం నాయకులు ఆదివారం తాంసీలో ఘనంగా నిర్వహించారు. ముందుగా డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా వెళ్లి నైవేద్యాలు సమర్పించి, కుల దైవానికి ప్రత్యేక పూజలు చేశారు. పంటలు బాగా పండాలని, గ్రామస్థులు సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు గుగ్గిల్ల పొచ్చన్న, మండల బీసీ యువజన విభాగం అధ్యక్షుడు దారవేణి రాఘవేంద్ర, సంఘం నాయకులు పాల్గొన్నారు.