గత కొన్ని రోజులుగా బొరిగాం గ్రామపంచాయతీలో నెట్వర్క్ ప్రాబ్లం ఉందని కొన్ని మీడియా, న్యూస్ ఛానల్ లో కూడా వచ్చిన కూడా ఇప్పటివరకు ఏ అధికారి కూడా వచ్చి కూడా స్పందించలేదని బొరిగాం గ్రామా విద్యార్థులు వారి తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని ఇబ్బందులు పడుతున్న కూడా అధికారులు స్పందించక పోవడంపై గ్రామస్తులు వాపోతున్నారు. అసలు పిల్లలు చదువుకోవాలా వద్దా అనే ఆలోచనలో విద్యార్థులు పడిపోయారు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వారి గ్రామానికి సిగ్నల్ ,నెట్వర్క్ రావటం లేదని, విద్యార్థులు చెట్లు, గుట్టలు, వాటర్ ట్యాంక్స్ ఎక్కి ఆన్లైన్ లో క్లాసులు వినటానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రమాదవశాత్తు జరగరానిది ఏదయినా జరిగితే దానికి బాధ్యత ప్రభుత్వమే వహించాలని వారి తల్లితండ్రులు ప్రభుత్వాని డిమాండ్ చేసారు. ఈ విషయమై జియో నెట్వర్క్స్ అధికారిని కలిసి వినతి పత్రం అందజేసినప్పటికీ వారి నుంచి కూడా ఎటువంటి స్పందన రాకపోవడంతో వారికీ మరల నిరాశే మిగిలింది. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మా ఊరికి కూడా సిగ్నల్స్ వచ్చే విధముగా చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు. ఇకనైనా ఈ పల్లెకు ఆన్లైన్ విద్యాబోధన అందేనా ..వేచి చుడాలిసిందే.