సోనాలలో గురువారం తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ ఆధ్వర్యంలో లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర సభ ఉంటుందని ఢీఎస్పీ మండల అధ్యక్షులు గణేష్ తెలిపారు. మా భూమి రథయాత్ర సారథి డా. విశారాధన్ మహారాజ్ ఈ సభకు హాజరుకానున్నారని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు అగ్రకుల పేదలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.