ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సీతక్క పర్యటన నేపథ్యంలో ఈనెల 6న సోమవారం నిర్వహించే ప్రజావాణి రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి సీతక్క జిల్లా పర్యటనలో భాగంగా పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని అన్నారు. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించే ప్రజావాణి రద్దు చేయడం జరిగిందని, ప్రజలు దీనిని గమనించి కలెక్టరేట్ కార్యాలయానికి రావద్దని సూచించారు.