ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని మర్లపెళ్లి రోడ్డుపై బుధవారం రెండు ఆటోలు ఢీకొన్న ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ ఐదుగురిని ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బోథ్ ఎస్సై రాము తెలిపిన వివరాలు మేరకు పంటచేలకు కూలీ పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా ఎదురెదురుగా వస్తున్న 2 ఆటోలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.