గుడిహత్నూర్ మండల కేంద్రంలో మహిళలు అత్యంత భక్తిశ్రద్ధల మధ్య వటసావిత్రీ వ్రతాన్ని బుధవారం నిర్వహించారు. శ్రావణమాసం కంటే ముందుగా వచ్చే పౌర్ణమి సందర్భంగా మహిళలు వటసావిత్రి వ్రతాన్ని నిర్వహించుకుంటారు. మర్రిచెట్టుకు పూజలు చేసి తమ పసుపుకుంకుమలను కలకాలం కాపాడాలని వేడుకున్నారు. ఆలయాలకు ఉదయం నుంచే మహిళలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో సందడి నెలకొంది. పూజల అనంతరం మహిళలు పసుపుబొట్టు పెట్టుకొని వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు.