బజార్‌హత్నూర్ మండల కేంద్రంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏఎస్ఐ లింబాజీ తెలిపిన వివరాల ప్రకారం, సుకుల్ తరుణ్ సింగ్ (23) గురువారం సాయంత్రం బహిర్భూమికి వెళ్తానని చెప్పి వెళ్లి సమీప చెరువు వద్ద పురుగుమందు తాగాడు. గుర్తించిన వ్యక్తి స్థానిక పీహెచ్‌సీకి తరలించగా, అక్కడి నుంచి రిమ్స్‌కి చేర్చినా చికిత్స పొందుతూ రాత్రి 7 గంటలకు మృతి చెందాడు. తండ్రి ప్రేమ్సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.