సర్వేలో ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్వహించాలి: ఆదిలాబాద్ కలెక్టర్
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా 473 గ్రామపంచాయితీల పరిధిలో 1, 49, 161 ఇళ్లలో 1, 612 ఎన్యుమరేటర్లు, 173 సూపర్వైజర్లు సర్వే నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. మున్సిపల్ పరిధిలోని 48, 393 ఇళ్లలో 385 ఎన్యుమరేటర్లు, 41 సూపర్వైజర్లు సర్వే నిర్వహించనున్నారని తెలిపారు. సర్వేపై గూగుల్ మీట్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సర్వే ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్వహించాలని ఆదేశించారు.