అదనపు వరకట్నం వేధింపులకు జైపూర్ మండలంలోని ఇందారం గ్రామానికి చెందిన ఇండ్ల లహరి( 21 )ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు. 2021లో ఇందారం గ్రామానికి చెందిన రమేష్ తో నస్పూర్ కు చెందిన లహరికి వివాహం కాగా వీరికి 18 నెలల పాప ఉంది. పెళ్లైన కొంతకాలానికి రమేష్ అత్తింటి వారు కట్నం కోసం ఆమెను వేధించసాగారు. ఆత్మహత్య చేసుకోగా తల్లి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేసినట్లు ఎస్సై తెలిపారు