క్యాతనపల్లి అమ్మ గార్డెన్ కాలనీకి చెందిన తడక దినేష్ (26) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్సై రాజశేఖర్ ఆదివారం తెలిపారు. దినేష్ తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లగా ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో దినేష్ గుర్తు తెలియని మాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్నేహితులు ఫోన్ చేయగా లేకపోవడంతో ఇంటికి వెళ్లి చూసి ప్రభుత్వ దవఖానికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.