జన్నారం మండలంలోని పలు గ్రామాలలో భారీ వర్షం ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో జన్నారం పట్టణంతో పాటు పరిసర గ్రామాలలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుండి కొంత ఎండ తీవ్రతతో పొడి వాతావరణమే ఉంది. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షంతో చల్లటి వాతావరణం ఏర్పడింది. నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వ్యవసాయ పనులను ముమ్మరం చేశామని పలు గ్రామాల రైతులు తెలిపారు.