ఖానాపూర్: రోడ్లపైనే పశువుల సంచారం.. రాకపోకలకు అంతరాయం
ఖానాపూర్ పట్టణంలోని బస్టాండ్, కొమరం భీమ్ చౌరస్తాలలో పశువుల సంచారం తీవ్ర ఇబ్బందులను కలిగిస్తుంది. ఎప్పుడు రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఉన్న ప్రధాన రహదారులలో ఇబ్బందులకు గురిచేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. పాదచారులు, వాహనచోదకులు పశువుల కారణంగా ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.