ఖానాపూర్: భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ లో ఓ వివాహిత భర్త వేధింపులు తాళలేక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మూడు నెలల క్రితం ఆలెపు రాజేష్ అనే యువకుడి తో శైలజకు వివాహమైంది. భర్త వేధింపులతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు ఖానాపూర్ పోలీసులు శవ పంచనామా నిర్వహించారు. శైలజ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు.