జన్నారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద 108 అంబులెన్స్ వాహనాన్ని స్పెషల్ ఆడిటర్ ఫకింగ్ దాస్ తనిఖీ చేశారు. మెడికల్ ఎక్విప్మెంట్ సరిపడా ఉందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. మెడిసిన్, ఆక్సిజన్ సంపూర్ణంగా ఉన్నాయా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాధితులు ఫోన్ చేయగానే సత్వరమే స్పందించి వైద్య సేవలు అందించాలని సూచించారు.. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.