మెట్ల మీద నుంచి పడి వ్యక్తి మృతి

53చూసినవారు
మెట్ల మీద నుంచి పడి వ్యక్తి మృతి
మెట్ల మీద నుంచి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన హాజీపూర్ మండలంలో చోటుచేసుకుంది. దొనబండకు చెందిన సుధాకర్ (48) ఇంటి నుంచి బయటకు వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు మెట్ల మీద నుంచి పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబీకులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సుధాకర్ మృతి చెందినట్లు ఎస్సై సురేష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్