రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

50చూసినవారు
రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
మంచిర్యాల- రవీంద్రఖని రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం తెల్లవారుజామున రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుని వయసు 40 నుంచి 45 సంవత్సరాలు ఉండగా, మల్టీ కలర్ పూల షర్టు, ఛాతీపై ఒక పుట్టుమచ్చ ఉంది. జీఆర్పీ ఎస్సై ఎ. మహేందర్ ఉత్తర్వుల మేరకు హెడ్ కానిస్టేబుల్ కెంసారం సంపత్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు తెలిసిన వారు 970112343, 8328512176 నంబర్లకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్