పట్టా పాసు పుస్తకం మంజూరుకు రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా మంచిర్యాల లాయంలో డిప్యూటీ తహసీల్దార్ నవీన్ కుమార్ ను ఏసీబీ అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. డబ్బును ప్రైవేట్ వ్యక్తి అంజి ద్వారా తీసుకుంటుండగా వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. రైతు ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ చర్యలు తీసుకుంది.