దండేపల్లి: అదనపు కట్నం కోసం వేధింపులు.. వివాహిత ఆత్మహత్య

59చూసినవారు
దండేపల్లి: అదనపు కట్నం కోసం వేధింపులు.. వివాహిత ఆత్మహత్య
అదనపు కట్నం వేధింపులు ఓ వివాహిత ప్రాణాలు తీశాయి. మంచిర్యాల (D) దండేపల్లికి చెందిన గంగధరి మల్లేశ్‌కు, బుగ్గారం(M) యశ్వంత్‌రావుపేటకు చెందిన వరలక్ష్మి (మేఘన)తో 2017లో వివాహమైంది. అదనపు కట్నం కోసం భర్త, అత్తామామ, భర్త సోదరులు వేధించసాగారు. ఆర్నెళ్ల క్రితం ఆడపిల్ల పుట్టడంతో మరింత ఎక్కువయ్యాయి. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టినా తీరు మారలేదు. చివరకు మేఘన ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

సంబంధిత పోస్ట్